. డంపింగ్ యార్డులో మృతదేహం లభ్యం
. సంగారెడ్డి జిలాలలో ఘటన
. పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు
భిక్కనూరు, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లుపల్లికి చెందిన బీజేపీ నాయకుడు మాలే నారాయణ(42) సంగారెడ్డి జిల్లాలో హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీలో మూడేళ్లుగా పని చేస్తున్న మాలే నారాయణ బీజేపీలో కొనసాగుతున్నారు. గత నెల 24వ తేదీ నుంచి ఆయన కనిపించకుండాపోవడంతో అతడి భార్య లక్ష్మి హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా ఖానాపూర్ మండలం దోర్పట్ల గ్రామ రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డులో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టి వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. హతుడిని భిక్కనూరు మండలం మల్లుపల్లికి చెందిన మాలే నారాయణగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నారాయణ భార్యతో పాట ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

