25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రేషన్‌షాపు ఏర్పాటు చేయాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : పట్టణ శివారులోని సంగమేశ్వర కాలనీలో రేషన్‌ షాపును ఏర్పాటు చేయాలని కాలనీవాసులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ.. ప్రతినెలా రేషన్‌ సరుకులు తీసుకోవాలంటే సుమారు రూ.100 ఒక్కొక్కరికి ఆటోకు ఖర్చవుతోందన్నారు. ఎక్కువ మంది రోజువారి కూలీలు ఉండడంతో రేషన్‌ తెచ్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో సంగమేశ్వర కాలనీవాసులు మతిన్, వాసిఫ్, ఇలియాస్, బాసిత్, మధు, రాజు తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article