24 C
Hyderabad
Sunday, August 2, 2026

మంజీరాపై ఇసుక మాఫియా పడగ

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ, కాంగ్రెస్ నేతల మిలాఖత్
  • రెండు పార్టీల అనుచరులదే పెత్తనం
  • మంజీరాలో ఎస్సైకి మాస్ వార్నింగ్

నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన మంజిరా నదిపై ఇసుక మాఫియా పడగ విప్పింది. గత ప్రభుత్వ హయంలో ఇసుక దందా చేసిన ప్రజాప్రతినిధి మనుమడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక దందా కోసం మిలాఖత్ అయ్యారు. ఏకంగా కిలో మీటర్ల దూరంలోకి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంజిరా పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, డంపింగ్ కార్యక్రమం రోజు జరుగుతుంది. ఇసుక తవ్వకాలు ఎమ్మెల్యేల అనుచరుల కనుసన్నల్లో జరుగుతుంటే, డంపింగ్ మాజీ ప్రజాప్రతినిధి మనుమడి కనుసన్నుల్లో సాగుతుంది. జాతీయ రహదారిపై ఇసుకను సరిహద్దులను దాటించడం ఎమ్మెల్యే అనుచరులుచేసే తంతు రోజు జరుగుతుంది.

Sand mafia bed on Manjira
నిజామాబాద్ జిల్లాలో మంజిరా పరివాహక ప్రాంతంలోని ఇసుక మద్నూర్, బిచ్కుంద మీదుగా అటు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ కు తరలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందా బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మంజిరా ఇసుక సరిహద్దులు దాటలంటే మాజీ బీఆర్ఎస్ నేత భూముల్లో నుంచే దాటాల్సి ఉంటుంది. సదరు బీఆర్ఎస్ నేత గడిచిన ఎన్నికల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోగా ఆయన మనుమడు కనుసన్నుల్లో ఇసుకను దాటిస్తున్నారు. పేరుకు అధికార ప్రతిపక్షాలను దుమ్మేత్తి పోసుకునే నేతలు ఇసుక దందాలో కలిసిమెలిసి దందాను చేసుకున్నారు. మంజిరా పరివాహక ప్రాంతమైన పోతంగల్, కొడిచర్ల ఇసుక మద్నూర్ మీదుగా సరిద్దులు దాటుతుంది. కొన్ని రోజుల క్రితం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సిర్పూర్ – హిప్పర్గ మధ్య 40 టిప్పర్ల ఇసుక డంప్ ను సీజ్ చేశారు. తర్వాత మళ్లీ ఇసుక దందాకు మాత్రం ఎలాంటి ఢొకా లేకుండా సాగుతుంది. గతేడాది చివరి మాసంలో ఏకంగా ఇసుక మాఫియా పోలీస్ చెక్ పోస్టునే తగలబెట్టింది.

Sand mafia bed on Manjira
గత వారం బాన్సువాడ నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పడిన మండలంకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి టిప్పర్ ను మంజిరా పరివాహక ప్రాంతంకు చెందిన ఎస్సై సీజ్ చేశాడు. రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న కారణంతో సీజ్ చేసిన టిప్పర్ ను తహసీల్ధార్ ద్వారా నామమాత్రపు ఫైన్ తో 12 గంటల వ్యవధిలో రిలీజ్ చేశారు.అ ది జరిగిన రెండవ రోజు రాత్రే ఇసుక మాఫియా నాలుగు టిప్పర్లలో ఇసుకను లోడ్ చేస్తుండగా స్థానిక ఎస్సై తన పెట్రో కారుతో వెళ్లగా ఇసుక మాఫియా బెదిరింపులకు దిగింది. ఎందుకంటే అప్పుడు ఎస్సైగారు ఫుల్ లోడ్ లో (మద్యం మత్తు)లో ఉండడమే కారణమని సమాచారం. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాలా అధికారులతో ఫోన్ చేయించాలా అని ఎస్సైనే బెదిరించడంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ వ్యవహరం ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అక్కడ స్థానిక ఇసుక మాఫియా నెలవారి మామూళ్ళు ఇస్తుండగా ఏ విధంగా దాడి చేస్తారని ప్రశ్నించడంతోనే ఎస్సై వెనక్కి తగ్గారని వినికిడి. మంజిరా పై ఇసుక మాఫియా పడగ ఉండడంతోనే రోజు వందల టిప్పర్ల, ట్రాక్టర్ల ఇసుక సరిహద్దుల్లో డంప్ కావడం అక్కడి నుంచి రవాణా అనేది జరుగుతుంది. ఒకవేళ అధికారులు సీజ్ చేస్తే అధికారికంగానే నామమాత్రపు ఫెనాల్టీతో ఇసుకను గమ్యస్థానానికి చేర్చే ఇల్లీగల్ దందా కాస్తా లీగల్ మారుతుంది.

Sand mafia bed on Manjira

More articles

Latest article