25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Must read

📰 Generate e-Paper Clip

కట్టుకున్న భర్తను  ప్రియుడితో కలిసి కడతేర్చిన భార్య

హత్య కేసు ఛేదించిన నసుల్లాబాద్ ఎస్సై లావణ్య

 

బతుకమ్మ, నస్రుల్లాబాద్ : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను  తన ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన నసురుల్లాబాద్ మండలంలోని నెమిలి గ్రామంలో చోటుచేసుకింది. పోలీసు కథనం ప్రకారం.. నసురుల్లాబాద్ మండలంలోని నెమిలి గ్రామానికి చెందిన టేకుర్ల మైసయ్య (40) 40 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈ విషయమై భార్య రాధా ఈనెల 21న భర్త టేకుర్ల మైసయ్య కనిపించడం లేదంటూ నసుల్లాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న నసురుల్లాబాద్ ఎస్సై లావణ్యకు  భార్య రాధ పై అనుమానం వచ్చింది. భర్త40 రోజుల క్రితం అదృశ్యమైతే ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేయడంపై భార్య రాధ పై అనుమానంతో పోలీసుల పద్ధతిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. తన భర్తను తాను, తనతో పాటు నాగరాజు అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. మృతుని భార్య రాధా చెప్పిన సమాచారం మేరకు హత్య చేసిన స్థలానికి వద్దకు ఎస్సై లావణ్య పోలీసులు వెళ్లి చూడగా సోమలింగేశ్వర ఆలయ సమీపంలో ఓ గుట్ట ప్రాంతం లో టేకుర్ల మైసయ్య మృతదేహం కనుగొన్నారు. హత్య చేసి సంచిలో మూటగా కట్టి ఎవరికి కనిపించకుండా సోమేశ్వర్ గుట్ట ప్రాంతాల్లో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు గుర్తించారు. తన వివహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు నాగరాజుతో కలిసి భర్తకు హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గత కొన్ని నెలలుగా టేకుర్ల మైసయ్య భార్య రాధా, నెమిలి గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య పలు సందర్భాల్లో గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. భర్త మైసయ్యను హత్య చేస్తే తన వివహేతర సంబంధానికి ఇంకా  అడ్డు తొలగుతుందని, పథకం ప్రకారం మైసయ్య భార్య రాధా, ఆమె ప్రియుడు నాగరాజు తో కలిసి మైసయ్యను ఉరివేసి చంపి, సంచిలో మూట కట్టి సోమేశ్వర్ గుట్ట ప్రాంతంలో ఉన్న లోయ లో పడేశారు. తన భర్త అదృశ్యమైనట్లు నాటకమాడి చివరికి పోలీసులకు చిక్కారు భార్య రాధా, ఆమె ప్రియుడు నాగరాజు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడకు తరలించి, ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మృతుని తల్లి లచ్చవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article