27.4 C
Hyderabad

ఐదుగురు జూదరుల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలో గల కళ్యాణి గ్రామ శివారులోని పోచమ్మ గుడి పక్కన పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,030, రెండు బైక్ లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్  తెలిపారు.

More articles

Latest article