28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 2009 బ్యాచ్ ఎస్సైల స్టడీ మెటీరియల్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ  : 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన 38 మంది ఎస్సైలు నిరుద్యోగ యువత ఉద్యోగ సాధనకు తమ వంతు సేవా  కార్యక్రమాన్ని నిర్వహించారు.  జిల్లాకు చెందిన 2009 బ్యాచ్ కు చెందిన ఎస్సైలు కన్న ఊరికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఓ సొసైటీని  ఏర్పాటు చేసిప్రతి యేడాదిసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డీసీఎల్ కు  స్టడీ మెటీరియల్ తో పాటు కుర్చీలు, ఫ్రీజ్ అందజేశారు.

2009 batch of essays study material provided to district central library

ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డికి రూ.2 లక్షల విలువైన స్టడీ మెటీరియల్, సామాగ్రిని అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రధానంగా ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఎస్సైలు చేస్తున్న సేవా నిరూపమానమైందని రాజారెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో నిరుద్యోగులకు కావాల్సిన సేవలను అందించేందుకు ముందుంటామని తెలిపారు. 2009 ఎస్సైల బ్యాచ్ కు చెందిన అధ్యక్షులు జి.కె.ప్రసాద్, రవి, జగడం  నరేష్, వేణు, నగేష్  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సైలను అంతిరెడ్డి రాజారెడ్డి అభినందించారు.

2009 batch of essays study material provided to district central library

More articles

Latest article