. . . ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు బి. భూమన్న
నిజామాబాద్, బతుకమ్మ :
ఈ నెల 18న కొత్తగూడెం జిల్లాలో విప్లవ కార్మిక సంఘాలైన ఇఫ్ట్ లు విలీనం కానున్నా వేడుకలను విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ ఎఫ్ టీ యు) నిజామాబాద్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు బి. భూమన్న, సూర్య శివాజీ లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలీన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1978లో గౌహతిలో ఐ ఎఫ్ టి యు ఉన్నతమైన రాజకీయ లక్ష్యంతో,విశాల కార్మిక క్షేత్రంలో ఆవిర్భవించిందని నాటి నుండి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సమశీల పోరాటాలు నిర్వహించిందని అన్నారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గపు మౌలిక లక్ష్యాలను విస్మరించి వ్యవహరిస్తున్నాయని ఈ నేపథ్యంలోనే ఐ ఎఫ్ టి యు ఏర్పడి బలమైన విప్లవ కార్మిక ఉద్యమ నిర్మాణం కోసం, విస్తరణకై కృషి చేస్తుందని అన్నారు. ఆనాటి నుండి అనేక ఆటుపోట్ల ను ఎదుర్కొంటూ చీలికలకు కూడా గురైందని, దేశ కార్మిక వర్గం ప్రతికూల పరిస్థితుల లో రెండు ఐఎఫ్ టి యు లు విలీనం కానున్నాయని అన్నారు. దేశంలో శాశ్వత స్వభావం కలిగిన పనులలో కూడా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తాత్కాలిక కార్మికులను వినియోగిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని, కనీస చట్టబద్ధ హక్కుల ను నిరాకరిస్తున్నారని దీనితో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, అనురాధ, సుప్రియ, మోహన్, రాజు, నర్సింగరావు, పోశెట్టి, శంకర్, సుధాకర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
