28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన కంజర పాఠశాల విద్యార్థి నవదీప్ సాయి

Must read

📰 Generate e-Paper Clip

  • సౌత్ ఇండియా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కంజర పాఠశాల పదో తరగతి విద్యార్థి నవదీప్ సాయి ప్రతిభ చాటారు. సౌత్ ఇండియా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఈనెల 7నుంచి 9 వరకు జడ్చర్లలో జరిగిన బాల వైజ్ఞానిక ప్రదర్శన ఆర్బీవీఎస్పీ  రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో గణిత నమూనాలు గణాంక ఆలోచనలు అనే విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర పదవ తరగతి విద్యార్థి రాచర్ల నవదీప్ సాయి జనవరి21నుండి 25వ తేదీ నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారతదేశ స్థాయి ఆర్ బి వి ఎస్ పి  పోటీలకు  ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలచారి తెలిపారు. ఈ స్థాయిలో విద్యార్థి విజయం సాధించడానికి విశేష కృషి చేసిన గైడ్ టీచర్ గణిత ఉపాధ్యాయుడు ఆర్.గోపాలకృష్ణ ను ప్రత్యేకంగా అభినందించారు.

Navdeep Sai is a student of Kanjara School who excelled at the state level

More articles

Latest article