నిజామాబాద్, బతుకమ్మ: అతిగా మద్యం సేవించి నగరంలో హనం నడిపిన 20 మందికి శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ సీఐ పి.ప్రసాద్ తెలిపారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హజరు పరచగా 16 మందికి రూ.25,000 జరిమానా విధించినట్లు తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఎండీ.సలీం, వర్ని మండలానికి చెందిన ఎస్.సంతోష్, నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన బి.సంతోష్, గంజి ప్రాంతానికి చెందిన కమల్ సింగ్ లకు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
