రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ చెరువులో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. చెరువు కట్ట పై నుంచి వెళ్తున్న స్థానికులు నీటిలో తేలియాడుతుండగా మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికంగా, సమీప గ్రామాల్లో ఎవరైనా కనపడకుండా పోయిన వారు ఉన్నారో అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
