26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విజయ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ  : జిల్లాలోని అమాయక పేదలను చికిత్స పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న విజయ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంగళవారం నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈనెల 30న నాళేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ నగరంలోని విజయ హాస్పిటల్ లోని న్యూరో స్పెషలిస్ట్ డా.విష్ణు వర్ధన్ వద్దకు చికిత్స కోసం వెళ్లిందన్నారు. అక్కడ ఉన్న రిసిప్షనిస్ట్ డాక్టర్ అందుబాటులో లేకున్నా రూ.400ఫీజు తీసుకుని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారని తెలిపారు. ఎంఐఆర్ తో సహా సుమారు 6టెస్టులు రాసిచ్చిందని తెలిపారు. డాక్టర్ పరీక్షించకుండానే 6టెస్టులు ఎలా చేయించుకోవాలని అడిగినందుకు పేషెంట్ ను బూతు మాటలు తిడుతూ అక్కడి నుంచి గెంటేశారని తెలిపారు. పేషెంట్ నడవలేని స్థితిలో ఉన్నా కనికరం లేకుండా గెంటేశారని తెలిపారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పేషెంట్ ను పరీక్షించకుండానే టెస్టులు రాయడం, అధికంగా మందులు రాయడం, పేద మధ్యతరగతి వారి నుంచి డబ్బులు గుంజడేమ లక్ష్యంగా లక్షలు గడిస్తున్నారని తెలిపారు. ఈ విషయం అడిగినందుకు సిబ్బందితో దాడులు చేస్తున్నారని తెలిపారు. నగరంలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ దందా నడిపిస్తున్నాయని తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్లను మచ్చిక చేసుకుని కమీషన్ల పేరుతో పేషెంట్ ను నిండా ముంచుతున్నారని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీకాంత్, తిరుపతి హన్మండ్లు, ఈర్ల రాజ్ గణేష్, అజిగిరి రాకేష్, నల్ల నవీన్ పాల్గొన్నారు.

More articles

Latest article