విజయ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని అమాయక పేదలను చికిత్స పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న విజయ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంగళవారం నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈనెల 30న నాళేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ నగరంలోని విజయ హాస్పిటల్ లోని న్యూరో స్పెషలిస్ట్ డా.విష్ణు వర్ధన్ వద్దకు చికిత్స కోసం వెళ్లిందన్నారు. అక్కడ ఉన్న రిసిప్షనిస్ట్ డాక్టర్ అందుబాటులో లేకున్నా రూ.400ఫీజు...