నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ పరీక్షలు ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీఈ, పిసిహెచ్, ఐఎంబిఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ఎల్), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్(ఐఎంబిఏ) ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీలను పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం, ఎమ్మెస్సీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈ అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష ఫీ రూ.500, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. ఎల్. ఎల్. బి, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్(పి సి హెచ్) అన్ని సబ్జెక్టులు కలిపి రూ.600, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. ఎంబీఏ, ఐ ఎం బి ఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. పీజీ మూడవ, ఐఎం బి ఏ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ (ఎం ఏ., ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్(ఏపీఈ)అన్ని సబ్జెక్టులు కలిపి రూ.500 చెల్లించాలన్నారు. ఐ ఎం బి ఏ.అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800 చెల్లించాలన్నారు. డిసెంబర్ 30 న ఉండగా పొడిగిస్తూ ఈ పరీక్ష ల ఫీ అపరాధ రుసుము లేకుండా 04-01-2025 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో తేదీ 08-01-2025 చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.
