28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మెడికేర్ హస్పిటల్  పై చర్యలు తీసుకోవాలని డియంహెచ్ఓ కు ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

  కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికేర్ హస్పిటల్  పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి కామారెడ్డి మండలం శాబ్ధిపూర్ గ్రామానికి చెందిన అబ్బగోని సిద్ధా గౌడ్ ఫిర్యాదు చేశారు.  తనకు జాతీయ రహదారిపై యాక్సిడేంట్ జరిగితే తనను మెడికేర్ హస్పిటల్ లో చేరగా ఆరోగ్య శ్రీ క్రింద ఆసుపత్రి వైద్యులు   ప్రవీణ్ గౌడ్ ,శిల్పలు జనవరి 6న తన చేతికి శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. నెల రోజులకు చేతి వాపు తగ్గకపొవడంతో మరోసారి మెడికేర్ హస్పీటల్ వైద్యులను సంప్రదించగా ఆపరేషన్ సందర్బంగా రాడ్ కు బిగించిన స్క్రూ  ఉడిపోయినందుకు మళ్లీ సర్జరీ చేయాలని సూచించారు. మార్చీ 14న డాక్టర్లు కిషోర్ గౌడ్, ప్రవీణ్ లు రెండోసారి సర్జరీ చేసిన తనకు చేతి నొప్పి సమస్య తీరలేదని భాధితుడు ఫిర్యాదులో పేరొన్నారు. రెండు సార్లు సర్జరీ చేసి తన చేతికు జరిగిన గాయం మానకపోగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తనకు ఆర్థిక, మానసీక క్షోభ అనుభవించానని కాబట్టి సంబందిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Complaint to DMHO to take action on Medicare Hospital

More articles

Latest article