24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాల్కొండ లో అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండల కేంద్రంలో గల నడిం గల్లి లో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే పల్లికొండ నరసయ్య అనే రైతు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న బట్టలు, వంట సామాగ్రి అతనికి ఈ మధ్యనే వడ్ల డబ్బులు వచ్చాయి వాటిని  కూడా ఒక సూట్ కేసులో పెట్టాడు అవి కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు పల్లికొండ నరసయ్య అతని వ్యవసాయ భూమిలో పొలం వేయడానికి వెళ్ళాడు సుమారు మధ్యాహ్నం రెండు గంటల వ్యవధిలో అతని ఇంటి నుండి పొగలు రావడంతో స్థానికులు ఇంటి యజమాని కి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు అదుపు చేయగా అప్పటికి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. అతనికి ఇంట్లో ఏ వస్తువు కూడా పనికిరాకుండా దగ్ధమయ్యాయి. బాధితుడు, అతని భార్యమమ్మల్ని ప్రభుత్వం దయతలిచి ఆదుకోవాలని బోరున విలపిస్తున్నాడు. అతడిని అతని భార్యను చూసి ఆ గల్లీ మహిళలు, అక్కడి ప్రజలు కంటతడి పెట్టుకుంటున్నారు.

More articles

Latest article