నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆదేశాల మెరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం లో ఆపరేషన్ స్మైల్ – 11ను నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్ర్మూ, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారి తల్లి దండ్రులకు అప్పగించి వారికి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. బాలకార్మికులను బిక్షాటనలో ఉన్న పిల్లలను వదిలివేయబడ్డ పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించి బలవంతంగా బిక్షాటన చేయించిన వారికి, వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా జనవరి 1 నుండి జనవరి 31 వరకు ప్రత్యేకంగా ” ఆపరేషన్ స్మైల్ 11 కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకోసం ప్రత్యేకంగా డివిజన్పరిధిలో ఒక ఎస్.ఐ స్థాయి అధికారిని నియమించి, తన క్రింద నలుగురు సిబ్బందిని ఒక మహిళా కానిస్టేబుల్ నియమిస్థామని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయి సమాచారం సేకరించి అట్టి విషయాన్ని హైదరాబాద్ లోని మహిళా భద్రతా విభాగం అధికారులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. తప్పిపోయిన బాల, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం ఇవ్వలని బాలకార్మికులను గురించి ఎలాంటి సమాచారం డయల్ 100 కు , స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 87126 59777, నిజామాబాద్ ఇంచార్జి మహిళా ఆర్.ఎస్.ఐ 87125 78197, ఆర్మూర్ ఇంచార్జి ఎస్.ఐ 9440140022, బోధన్ ఇంచార్జి ఎస్.ఐ 87126 59876 ఫోన్ చేసి సమాచారం అందించగలరు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అన్నారు. ఈ కార్యక్రమంలో సి.సి.ఆర్.బి ఎ.సి.పి ఎ.రవీంధర్ రెడ్డి, సి.ఐ ఎ. సురేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్ డి. సంపూర్ణ, లేబర్ ఆఫీసర్ యోహన్, హెల్త్ డిపార్టుమెంటు జి. రాజు, ఎడ్యూకేషన్ ఆఫీసర్ ఎమ్. సాయిరెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, ఎ.హెచ్.టి. యూ (యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సిబ్బంది ,నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ అధికారులు ,సంబంధిత సిబ్బంది హజరుకావడం జరిగింది.

