బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామంలో సోమవారం ఘనంగా కండోభ జాతర నిర్వహించారు. అనంతరం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి మల్లయోధులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పాల్గొని తిలకించారు. మొదటి కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లయోధులకు బహుమతులు వెండి పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మాజీ ఎంపీటీసీ వెంకట్ గౌడ్, గంగు నాయక్, రమేష్ దేశాయ్, బొంపెల్లి రాజుల సెట్ జుక్కల్ సొసైటీ మాజీ చైర్మన్ రాజు పటేల్, గ్రామస్తులు తదితరులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

