30.9 C
Hyderabad
Monday, August 3, 2026

గారడి మాటలో కేవలం ఒక శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

Must read

📰 Generate e-Paper Clip

. . . కేసీఆర్ పథకాలే తప్ప కొత్త పనుల జాడ లేదు

. . . రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగాయి

. . . భూ భారతి చట్టంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుధల చేయాలి

. . . నిడ్రా పేరుతో పేధలకు కంటీమీద కునుకు లేకుండా చేశారు

. . . కేసిఆర్ ను బద్నాం చేయడానికి ఎస్సారెస్పీని ఎండ బెట్టారు

. . .  జిల్లా కు మంత్రి పధవి లేకుండా చేసి అనాధను చేశారు

. . . ఆరు నెలలుగా పొలిస్ కమీషనర్ లేక  క్రైం రేట్ పేరిగింది

. . .  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

 నిజామాబాద్, బతుకమ్మ:

 

కాంగ్రెస్ పార్టి అమలుకు సాధ్యం కాని హమీలను ముఖ్యంగా అర్రస్ పాడినట్లు రెట్టింపు స్థాయిలో సంక్షే మ పథకాలను ఇస్తామని గారడి మాటలతో ఓక్క శాతం ఓట్లతొ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.  జిల్లాలో తనకు అపూర్వ స్వాగతం పలికిన జిల్లా ప్రజానికానికి, పార్టి నాయకులకు కార్యకర్తలకు సోమవారం పార్టి జిల్లా కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతు… కేసీఆర్ కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా ప్రజలను చూసుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.  రైతు బంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదు, రైతు కూలీలకు కూడా సాయం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏం చేయలేదు అని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు  అని, రాష్ట్రంలో ప్రతీ మూడు గంటలకు మహిళలపై ఒక అత్యాచారం జరుగుతోందని, ప్రతీ ఐదు గంటలకు ఒక మహిళా కిడ్నాప్ అవుతోందని డిజిపి ఇచ్చిన నివేధికలో స్పష్టంగా ఉందన్నారు. మహిళా భద్రత కోసం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేశారు .ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరగడం తప్పా ఏం చేయడం లేదు .కేసీఆర్ హయాంలో పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేది… ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతోందని ఎద్ధేవ చేశారు. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడం దారుణం సీఎం రేవంత్ రెడ్డి మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు.

 

According to Garadi, Congress came to power with only one percent of votes

రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగమంటూ తిరుగుతుంటే… ఇక్కడ సీయం రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనట్లు రెండు పెద్ద ఎన్ కౌంటర్లు జరిగాయి .తుపాకి మోతలు ఉండవద్దన్న లక్ష్యంతో పరిపాలన చేసిన వ్యక్తి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు భగ్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అని కవిత విమర్శలు చేశారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్యాకేజీ 21,22 కు సంబందించిన బిల్లులు మాత్రం కాంట్రాక్టర్ లకు విడుదల చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రైతులను నరకయాతన పెట్టడానికి భూభారతి చట్టాన్ని ప్రభుత్వం  తీసుకోచ్చిందన్నారు. రీసర్వే చేసే  ముందు భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి . భూముల రీసర్వే పేరిట ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద రాయన్న నమ్మకం ప్రజలకు, రైతులకు లేదుకాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారు అన్నారు. నిజామాబాద్ జిల్లా కు మంత్రి పదవి రాక అనాథగా మారింది జిల్లా నుంచి కనీసం ఒక మంత్రి కూడా లేరని, ఇంచార్జీ మంత్రి ఉన్నా లేనట్లే అన్నారు. ఎంపీ ఉన్నా లేనట్లే… ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు పవర్ లేదని అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు  అని ఆరోపించారు. నిజామాబాద్ కు ఆరు నెలల నుంచి పోలీసు కమిషనర్ లేకపోవడం దారుణం  కవిత అన్నారు. ఏడాదికాలంలో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు ఇవ్వలేదు ,కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక కొత్త పని చేపట్టలేదు  అన్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు ,మేడిగడ్డ విషయంలో కేసీఆర్ ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారు  అని కవిత ఆరోపించారు. జిల్లాలో ఓడిన షబ్బీర్ అలీకి నిజామాబాద్ పై ఆలోచన లేదు, పట్టిలేదు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దందా జరుగుతోంది. మైనింగ్ కార్పొరేషన్ చైర్మెన్ ఇలాకాలో ఇసుక పొలిస్ స్టేషన్ ల ముందునుంచి హద్ధులు దాటడంతో ఇప్పుడు మైనింగ్ శాఖ ఆదాయం తగ్గింది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు తక్షణమే నిధులు విడుదల చేసి… వర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి అని కవిత కోరారు. కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17 న ఫ్యాక్టరి తెరుస్తామని ప్రజలకు హమీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్ లో నిడ్రా పెడుతామని పెదలకు పీసీసీ అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్ పెదలకు కంటినీండా కునుకు లేకుండా చేశారన్నారు. బుల్డోజర్ తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు  ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే మేము ఊరుకోబోమని కవిత హెచ్చారించారు. పీసీసీ చీప్ గా ఉన్న మహేష్ కుమార్  గౌడ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి డేవలప్ చేయాలని కవిత కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ నీతు కిరణ్, మాజీ జడ్పి చైర్మెన్ విఠల్ రావు, బోదన్ కు చెందిన అయేషా పాతిమా, నగర అధ్యక్షులు సిర్ప రాజు, గడ్డం సుమనరెడ్డి, విశాలిని రెడ్డి తదితరులు పాల్గోన్నారు.According to Garadi, Congress came to power with only one percent of votes

 

 

More articles

Latest article