పరిషత్ ముందు దిష్టి బొమ్మలా..
జిల్లా పరిషత్, బతుకమ్మ: జిల్లా పరిషత్ లోని జడ్పిటిసిల విశ్రాంతి భవనం కారిడార్… కార్ పార్కింగ్ కు నిలయమైంది. ఇటీవల దిగిపోయిన సభ్యులు ఆ భవనాన్ని వాడుకోలేదు గాని పరిషత్ ఉద్యోగి మాత్రం కారు కొనుగోలు చేసినప్పటి నుంచి అదే స్థలంలో పార్కింగ్ చేస్తున్నాడని అందులోని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ రూరల్ మండల కార్యాలయాన్ని విశ్రాంతి భవనంలోకి మార్చారు. వారి నిధులే ఖర్చుపెట్టుకొని శుభ్రం చేయించుకున్నారు. కార్యాలయంలోకి రాకపోకలు సాగించే వాళ్లకు దిష్టి బొమ్మను చూసినట్లుగా కనబడుతోందని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సంధర్శకులతోపాటు, సిబ్బంది పేర్కొంటున్నారు. కారును కారిడార్ నుంచి తీయుమని చెప్పలేం ..అలాగని అర్థం చేసుకొని తీయలేడు.. ఎవరికి చెప్పిన ప్రయోజనం లేదని పరిషత్ ఉద్యోగులు మిన్నకుండిపోతున్నారు. జడ్పిలో పని చేసే చాలా మందికి కార్లు ఉన్నాయి, అలాగని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయట్లేదు. ఇంతకుముందు అంటే పోనిలే అనుకోవచ్చు, ప్రస్తుతం అందులో మండల్ పరిషత్ కార్యాలయం వచ్చింది. తెలిసిన వారికీ అయితే చెప్పొచ్చుగాని , మిడిమిడి తెలివి ఉన్నవారికి అక్కడి నుంచి కారు తీసివేయుమని ఎలా చెప్పగలమని పరిషత్ ఉద్యోగులు మాట్లాడుకోవడం వినిపించింది. పాలనాపరంగా దిగిపోయిన నాయకునికి సహచరునిగా ఉన్నాననే అహంభావంతోనే కారును కారిడార్ నుంచి తీయట్లేదనే చర్చ జరుగుతోంది.
Next Post