27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన రాజారపు వసంతకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనారోగ్య కారణంతో రాజారపు వసంతం హాస్పిటల్లో చికిత్స చేసుంచుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించి రాజారపు వసంతకు రూ.21వేల సీఎంఆర్ఏఫ్ చెక్కు మంజూరు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా లబ్దిదారులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దండ బోయిన సాయి, సున్నపు శ్రీను, పడిగెల చిన్న గంగాధర్, ఈరపట్నం చిన్న గంగాధర్, మెరుగు సురేష్, కూరాకుల సాయన్న, మైబూబ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article