27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి విక్రయాలు అరికట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో గంజాయి విక్రయలు జోరుగా సాగుతున్నాయని.పోలీసులు వాటినీ అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు అన్నారు. శనివారం ఆర్మూర్ ఏసీపీ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.అనంతరం మీడియా తో ఆరెపల్లి సాయిలు మాట్లాడుతు. ఒక్కప్పుడు సినిమాల్లో మాత్రమే గంజాయి అంటే చూసేవాళ్ళమని కానీ ఇప్పుడు ఏకంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోనే కాకుండా మండలాలనుండి.పల్లెల్లో కూడా గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. వాటిని అరికట్టాలని యూవత, విద్యార్థులు, గంజాయి, మత్తు పదార్థాలకి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి సేవించిన మత్తులో తల్లిదండ్రుల పై దాడులకూ దిగుతూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తక్షణమే గంజాయి విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. అలాగే నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్నoదున యువత చెడు మార్గంలో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తక్షణమే గంజాయి ని అరికట్టెందుకు పోలీసులు భద్రత పెంచాలని ఏసీపీ ని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో సోమా శ్రీను, మాదరి నరేష్, దుర్గం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article