ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో బహుమతులు సాధించారు. ఫుట్ బాల్ ఉమెన్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంఈఓ రాజా గంగారం, ప్రిన్సిపాల్ శ్యామ్, వ్యాయామ ఉపాధ్యాయుడు జి.అప్పారావు విద్యార్థినులను అభినందించారు.

