24.7 C
Hyderabad
Monday, August 3, 2026

న్యాయవాద పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా మనోజ్ రాథోడ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్:  కామారెడ్డి జిల్లా న్యాయవాద పరిషత్ ఎన్నికలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ కార్యాలయంలో నిర్వహించారు. బిచ్కుంద  మండల కేంద్రానికి చెందిన యువ న్యాయవాది మనోజ్ రాథోడ్ ను జిల్లా న్యాయవాద పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షుని ఆదేశాల మేరకు రాష్ట్ర కోశాధికారి మంగులాలు సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది బి. దామోదర్ రెడ్డి, కోశాధికారిగా గంగరాజు, సెక్రటరీగా భార్గవ్ చంద్ర భూపాల్, వైస్ ప్రెసిడెంట్స్ గా సందీప్ రెడ్డి, మనోజ్ రాథోడ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ రాథోడ్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం, ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేసి జిల్లా న్యాయవాద పరిషత్ కు పేరు తెస్తానన్నారు.

More articles

Latest article