బోదన్, బతుకమ్మ : బోదన్ పట్టణంలోని నిజాం చక్కెర కర్మాగారం వద్ధ కార్మికులు బ్లాక్ డే నిర్వహించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ డిసెంబర్ 23న 2015 రోజున అర్థ రాత్రి అక్రమ లే ఆఫ్ చేసి కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసి చీకటి రోజుగా మిగిల్చిన రోజున నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రథాన గేటు దగ్గర నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కార్మీక నాయకులు మాట్లాడుతు…. కార్మికులకు రావలసిన తొమ్మిది సంవత్సరాల వేతనాలు ఇప్పించి కార్మికులను, కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ నీ ఓపెన్ చేస్తామని కార్మికులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కార్మికుల వేతనాలు ఇప్పించలేదు అన్నారు .ఇక నైనా కార్మికులకు రావలసిన వేతన బకాయి వేతనాలు ఇప్పించి కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్ రాంబాబు బీజేపీ నాయకులు రామరాజు కార్మిక సంఘం నాయకులు ఈరవేని సత్యనారాయణ శ్రీధర్, దాస్, భూమయ్యా, శివరాములు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
