- గుంజిళ్ళ తో ఆందోళన నుండి ఉపషమనం
- బుద్ది, ఏకగ్రత, సృజనత్మకత పెంపు
- రాష్ట్ర అవార్డు గ్రహిత అందే జీవన్ రావు
భీమ్ గల్, బతుకమ్మ : సూపర్ బ్రెయిన్ యోగలో గుంజీళ్ళ విధానం అత్యంత మెరుగైన విధానమని రాష్ట్ర అవార్డు గ్రహిత, గుంజీళ్ళ మాస్టర్ అందే జీవన్ రావు అన్నారు. సోమవారం భీమ్ గల్ గవర్నమెంట్ హైస్కూల్ లో విద్యార్థిని, విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగ అంశం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూపర్ బ్రెయిన్ యోగ లో గుంజీళ్ళు (పస్కిల్) తీయ్యడం ద్వారా మెదడు చురుకుధనం పెరిగి జ్ఞాపకశక్తి మెరుగు పడుతుందని తాజా పరిశోధనల్లో తెలిందన్నారు.ఈ సూపర్ బ్రెయిన్ యోగ వలన జ్ఞానం, ఏకగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్యల పరిష్కరం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మాకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపోంది ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రతి రోజు విద్యార్థులు పాఠశాలలో విధిగా ప్రార్థన సమయంలో ఈ సూపర్ బ్రెయిన్ యోగ చేయడం ద్వారా సమగ్రఅభివృద్ధికి దొహదం చెస్తుందన్నారు. ఈ సూపర్ బ్రెయిన్ యోగ లో పిలిప్పిన్ కు చెందిన ప్రాణిక్ హీలీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్ సుయ్ ఈ గుంజీళ్ళ పై అధ్యయనం చేసారని తెలిపారు. విద్యార్థుల సందేహాలకు సమాధానం చెప్పిన జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగ అంశం పై సమర్పించిన పరిశోధన పత్రాలను హెడ్ మాస్టర్ గంగారాం కు అందజేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం, భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

