జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ళ సర్వే వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రామా రెడ్డి మండలం పోసాని పేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇళ్ళ సర్వే కు సంబంధించిన యాప్ లో లబ్ధిదారురాలు యొక్క సమాచారం, ప్రస్తుతం ఇంట్లో నివసిస్తున్న ఫోటో, భూముల వివరాలు, కుటుంబ వివరాలు, వితంతువులు, దీవ్యాంగులు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రతీ రోజూ 20 నుండి 30 ఇండ్ల వరకు సర్వే చేయాలని తెలిపారు. సర్వే పనులను వేగంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
