26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ, ప్రజల కోసం అంకితం చేసినందుకు ఉద్యోగ విరమణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్

నిజామాబాద్, బతుకమ్మ : ఉద్యోగి అతి ముఖ్యమైన కాలాన్ని వయస్సును ప్రభుత్వ సేవ కోసం ప్రజల కోసం అంకితం చేసినందుకు ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితం సవ్యంగా సాగిపోయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని. అది ఉద్యోగుల ప్రాథమిక హక్కుని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్  అంకిత్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జాతీయ పెన్షన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల బాధ్యతలను శుభ సభ్యులు కుటుంబ సభ్యులు సక్రంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే సమాజం ,వ్యవస్థ, అభివృద్ధికరంగా తయారవుతుందని అయన అన్నారు. అధ్యక్షులు కె . రామ్మోహన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త గా హాజరైన పెన్షనర్ల జాతీయ నాయకురాలు  సంయుక్త మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ పెన్షన్ హక్కును మన పూర్వీకులు సాధించి పెట్టారని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. 17డిసెంబర్ 1982 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలు శిరోధార్యంగా భావించాలని పెన్షన్ అనేది ఒక హక్కుగా ప్రభుత్వాల దయాదాక్షిన్యాలపై ఇచ్చే దానం కాదని తీర్పులో పేర్కొన్నారని ఆమె అన్నారు.

Retirement for dedication to government and people

కానీ దానికి విరుద్ధంగా 2004తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని దీని మూలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్షన్ను ఒక సరుకులా కొనుక్కోవలసి వస్తోందని ఇది ప్రభుత్వాలకు తగదని , ఐదు సంవత్సరాలకు అధికారంలో ఉన్నవారికి పెన్షన్ ఉందని,40 సంవత్సరాలు ప్రజలకు,సమాజానికి సేవచేసిన వారికి పెన్షన్ లేదనటం దుర్మార్గమని ఆమె అన్నారు.గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి మాట్లడుతూ పెన్షనర్స్ తన అనుభవం తో సమాజానికి ఎంతో సేవలందిస్తున్నారు.తన జీవితాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేశారని వారిని సమాజం గుర్తుంచుకోవాలని అన్నారు. వారు సమాజానికి వెలుగనీ, వారు ఎదుర్కొంటున్న  సమస్యల పరిష్కారానికి  చేస్తామని అన్నారు.

Retirement for dedication to government and people

స్త్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల జిల్లా అధికారిని  రసూల్ బి మాట్లాడుతూ  పిల్లల పై ప్రేమతో  తల్లిదండ్రులు తమ ఆస్తిపాస్తులను వారసులకు అప్పగిస్తున్నారని ,కానీ దురదృష్టవశాత్తు పెద్దవారి  బాగోగులు చూడటానికి అనేకమంది నిరాకరిస్తున్నారని ఇది సమాజంలో కొనసాగాటం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా ట్రెజరరీ డిప్యూటీ డైరెక్టర్ కే దశరథ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు పెన్షనర్స్ డే ని ఘనంగా పండుగలా నిర్వహించుకుంటున్నారని  జిల్లాస్థాయిలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పెన్షనర్లకు ఘనంగా వారి సేవలకు గుర్తింపుగా అతిథులు సన్మానింఛారు. గత రెండు రోజులుగా జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల స్త్రీ పురుష విభాగాలలో జరిగిన ఆటల పోటీలలో విజేత లైనటువంటి వారికి  అడిషనల్ కలెక్టర్ ఇతర అతిథులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  మధుసూదన్, ఈవీఎల్ నారాయణ, హమీద్దుద్దీన్, హనుమాన్లు, ప్రసాద్ రావు, కృష్ణారావు, బాబా గౌడ్, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, భోజారావు, హాజరయ్యారు. సిర్ప లింగయ్య, శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఆలపించిన పాటలు, అత్యధిక సంఖ్యలో  హాజరైన రిటైర్డు ఉద్యోగులను ఉత్సాహపరిచారు విజయవంతం చేశారు.

Retirement for dedication to government and people

More articles

Latest article