30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నలుగురిపై దొంగతనం కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌక్ వద్ద గల పవార్ సాయి తరుణ్ అనే వ్యక్తి వద్ద షెడ్ లో ఉన్న తన  డీజే ను  సామాగ్రీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి పుటేజీల ఆధారంగా నలుగురిపై కేసు నమోదు చేశారు. నాగిరెడ్డి పేట్ మండలం మేల్లకుంట తండా, మహాదేవుని గడ్డ తండాకు చెందిన రాందాస్, విట్టల్, అనిల్, నరేందర్ లు  ఈ నెల 11న తెల్లవారు జామున గూడ్స్ వాహనంలో వచ్చి  డీజే లో ఉన్న ఆమ్ప్లిఫయర్లు ధ్వంసం చేసి వైర్లను  తెగగొట్టి డీజే వాహనంలో ఉన్న  పసుపు రంగు టాపర్ ను దొంగలించారు. వారి వద్ద నుండి టాపర్ ను రికవరీ చేయడం జరిగిందని డీజే ఆమ్పిల్ ఫైర్ కేబుల్స్ లను డామేజ్ చేసినట్లుగా, టాపర్ ను దొంగతనం చేసినట్లుగా తెలింది. ఇట్టి దాని డామేజ్ ఖర్చు అందజ 3లక్షల 50వేల వరకు ఉంటుందని పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ మహేష్ తెలిపారు.

A case of theft has been registered against four people

More articles

Latest article