27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానికత ఆధారంగా ఉద్యోగులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ కోరారు. హైదరాబాద్ లోని టిఎన్జీవో కేంద్ర కార్యాలయంలో శాసనమండలి సభ్యులు కోదండరాం ఆధ్వర్యంలో.. టీజీఈజేఎసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేనీ అధ్యక్షతన శుక్రవారం 317 జీవోపై అత్యవసర సమావేశం ఏర్పాటు  చేశారు. టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ హాజరై 317 జీవో బాధితుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, స్థానికత ఆధారంగా ఉద్యోగులందర్నీసొంత జిల్లాలకు త్వరగా బదిలీలు చేసి, ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలని కోరారు.  ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు, టీఎన్జీవో కేంద్ర సంఘ సహాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

More articles

Latest article