- ఎస్సీ ఎస్టీ యూనియన్ పేరిట అడ్డంగా దోచుకున్న దారి దోపిడి దొంగ కాదేపూర్ గంగారం
- బిచ్కుంద ప్రెస్ మీట్ లో దళిత జర్నలిస్టుల ఆరోపణ
బతుకమ్మ:బిచ్కుంద : గత నెలలో హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ ఎస్సి, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహా సభ సందర్బంగా ఈ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కదేపురం గంగారాం సభకోసం ఉమ్మడిజిల్లా లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కొందరు నాయకుల వద్దకు వెళ్లి నిధి సేకరించాడని మిటి సలహాదారులు సీనియర్ జర్నలిస్ట్ జె.వీరన్నతెలిపారు. దీనిపై సభ అనంతరం బాన్స్ వాడ ఆర్ అండ్ బి అతిథి గృహం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర మహాసభ కు ఇక్కడినుండి నిధి సేకరించడం ఏంటని ఇది సరైన పద్ధతి కాదంటూ సేకరించిన నిధి వివరాలు చెప్పాలంటు సభ్యులు మీడియా పరంగా వివరించారు. దీన్ని పై రాష్ట్ర కమిటి సభ్యులు వచ్చి నిధి సేకరించుమని తామే చెప్పామంటూ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని గురువారం కమిటి సలహాదారులు సీనియర్ జర్నలిస్ట్ జె.వీరన్న మండిపడ్డారు. జిల్లాలో ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేస్తే నిధి సేకరించాలి కాని హైదరాబాద్ లో జరిగే సభకు ఇక్కడినుండి నిధి సేకరించడం సరైన పద్ధతి కాదని దీనిపై నిజానిజాలు తెలుసుకోకుండా రాష్ట్ర కమిటి బాన్స్ వాడ కు వచ్చి సంఘ సభ్యులకు, జిల్లా కమిటి కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండ మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం సరైన పద్ధతి కాదని అన్నారు. రాష్ట్ర కమిటి సభ్యులు వచ్చినప్పుడు జిల్లా కమిటి సభ్యులు, జిల్లా, రాష్ట్రా నికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి కూర్చోబెట్టి నిజానిజాలు తెలుసుకోవాల్సింది పోయి గంగారాం కు క్షమాపణ చెప్పాలంటు లేని పక్షం లో వారిపై చర్యలు తీసుకుంటామని అనడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. రాష్ట్రం లో ప్రాతినిధ్యం వహించే దమ్ము లేని వారు ఎందుకు ఈ కమిటి వేశారాని అదే జిల్లా లో సభ ఏర్పాటు చేస్తే రాష్ట్ర కమిటి నుండి జిల్లా కు నిధి సమాకూర్చి జిల్లా కు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న గంగారాం తన వైఖరి ని మార్చుకొని అందర్ని కలుపుకుపోవాలి అది చేతకాకపోతే ఈ సంఘం పేరుపై ఇకముందు ఉమ్మడిజిల్లాలో ఎక్కడైనా అక్రమ నిధి సేకరణ కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమం లోతెలంగాణ ఎస్సై, ఎస్సి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారిశెట్టి హన్మాండ్లు, పోశీరం, ప్రభానంద్, మిర్రెవర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
