26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో గురువారం  బద్దం వారి కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశ అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యgలో కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నూతనంగా నియామకమైన దోంచంద గ్రామానికి చెందిన కొర్రుపల్లి లింగారెడ్డి,ని శాలువాతో సన్మానించారు.మండల యువజన కాంగ్రెస్ ఎన్నికలలో  అధ్యక్షులుగా గెలుపొందిన తోర్తి గ్రామానికి చెందిన దానం గంగామోహన్ ను అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బట్టపూర్ కు చెందిన మహ్మద్ రఫీ, తోర్తి గ్రామానికి చెందిన బొల్లాపల్లి సుమన్ గౌడ్ ను మండల స్థాయిలో అత్యధిక యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలు చేపించిన ఏర్గట్ల గ్రామానికి చెందిన దండేవోయిన సాయి, మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవులు పొందిన వీరందరిని మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవ రెడ్డి, మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త  కాంగ్రెస్ ప్రజాపాలన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చెయ్యాలని, పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు యుంటిదని కష్టపడి పని చెయ్యాలని అన్నారు. ఇట్టి కార్యక్రమములో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, జింక అనిల్ యాదవ్, ఆడెం గంగ ప్రసాద్, ముస్కు మోహన్ రెడ్డి, గుమ్మి ర్యాల చిన్న సంజీవ్ యాదవ్ ,పన్నాల నర్సారెడ్డి, బద్దం లింగారెడ్డి, పాకాల ప్రసాద్ గౌడ్ , బెజ్జారపు బాను, మేకల సాయన్న,మండల కాంగ్రెస్ నాయకులు, మండల అన్ని గ్రామల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు, యువజన సంఘం సభ్యులు, పాల్గొన్నారు.

More articles

Latest article