29.2 C
Hyderabad

ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై గురువారం ఎత్తోండా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నా వంతుగా బిజెపి పార్టీ కోసం అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సాయ సాకారంతో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిజెపి పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడ్డుకుంట్ల శ్రీనివాస్, నస్రుల్లాబాద్ మండలం బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు, వర్ని మండల అధ్యక్షులు శంకర్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article