డా.యెల్లోసా జెటలింగ్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మానవ హక్కుల రక్షణతోనే శాంతి సమానత్వం అభివృద్ది అవుతుందని డా.యెల్లోసా జెటలింగ్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ 1&4 యూనిట్ ల ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.యెల్లోసా జెటలింగ్ హాజరై మనవ హక్కులు-మన భవిష్యత్తు అనే అంశం పై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ప్రజాస్వామ్య దేశాల్లో కూడా జాతీ, మత, లింగ వివక్ష అధికంగా ఉండడం విచారకరమన్నారు. ప్రస్తుతం మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలు మరింతగా దిగజారుతు న్నాయన్నారు. పాలకులు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి, లా కాలేజ్ ప్రిన్సిపాల్ కే.ప్రసన్న రాణి మరియూ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ కే.రవీందర్ రెడ్డి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా.స్వప్న ,డా.స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.
