మానవ హక్కుల రక్షణతోనే శాంతి, సమానత్వం
డా.యెల్లోసా జెటలింగ్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మానవ హక్కుల రక్షణతోనే శాంతి సమానత్వం అభివృద్ది అవుతుందని డా.యెల్లోసా జెటలింగ్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ 1&4 యూనిట్ ల ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.యెల్లోసా జెటలింగ్ హాజరై మనవ హక్కులు-మన భవిష్యత్తు అనే అంశం పై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ప్రజాస్వామ్య దేశాల్లో కూడా జాతీ, మత, లింగ వివక్ష అధికంగా ఉండడం విచారకరమన్నారు. ప్రస్తుతం మానవ సంబంధాల కంటే...