30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

షాద్ నగర్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : వెలమ సామాజిక వర్గాన్ని అకారణంగా దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చట్టరీత్యా  చర్యలు తీసుకోవాలని  నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ రూరల్ పోలీస్  స్టేషన్ లో శనివారం జిల్లా వెలమ సంఘం  బాధ్యులు లిఖితపూర్వకంగా ఎస్సైకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వి. కిషోర్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డి. విట్టల్ రావు,మాజీ నిజామాబాద్ జిల్లా వెలమ సంఘ అధ్యక్షులు డి.ఆర్. రామ్ కిషన్ రావు,  దాదన్నగారి  మధుసుదన్ రావు, మాజీ ప్రధాన కార్యదర్శిలు,మాజీ కార్యదర్శి, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

Complaint against Shadnagar MLA in police station

More articles

Latest article