షాద్ నగర్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : వెలమ సామాజిక వర్గాన్ని అకారణంగా దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చట్టరీత్యా  చర్యలు తీసుకోవాలని  నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ రూరల్ పోలీస్  స్టేషన్ లో శనివారం జిల్లా వెలమ సంఘం  బాధ్యులు లిఖితపూర్వకంగా ఎస్సైకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వి. కిషోర్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డి. విట్టల్ రావు,మాజీ నిజామాబాద్ జిల్లా వెలమ...