26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్గీకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఎస్సీ జనాభా దామాషా ప్రకారం 15శాతం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం (ఎంజేఎస్) రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా కన్వీనర్ తెడ్డు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణలో కూడా  15శాతం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని  మాదిగ జాగృతి సంఘం ద్వారా కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  తెలంగాణలోని ఎస్సీ జనాభాలో 70శాతం ఉన్న మాదిగలకు 10శాతం, 30శాతం లోపు ఉన్న మాలలకు 4శాతం, ఒక శాతంలోపు ఉన్న ఎస్సీ ఉపకులాలలకు ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. జిల్లా కమిటీ ప్రతినిధులు సంతోష్, బాగేంద్ర, రమేష్, సాయినాథ్, రాజు,వినోద్, సురేష్, గంగాధర్, రవి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article