ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్గీకరించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఎస్సీ జనాభా దామాషా ప్రకారం 15శాతం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం (ఎంజేఎస్) రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా కన్వీనర్ తెడ్డు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణలో కూడా 15శాతం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం ద్వారా కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో 70శాతం...