భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని చొక్కయ్య గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రమనీయం, కమనీయంగా అర్చకులు నిర్వహించారు. ప్రతి యేటా నిర్వహించే శ్రీ వారి కల్యాణమహోత్సవంలో భాగంగా మంగళవారం అర్చకులు ఉదయం 6 గంటలకు ప్రాబోధిక, 9.30 కు విష్యక్షేనది చతుస్తానార్చన కార్యక్రమాలను నిర్వహించారు. 10.35 శుభ లగ్న మూహుర్థమున అర్చకులు స్వామి వారికీ వసంతోత్సాహం నిర్వహించి దేవస్థాన కమీటీ బోదిరే సంఘం ఆధ్వర్యంలోలోక కళ్యాణర్థం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ను ఘనంగా నిర్వహించారు.అనంతరం అర్చకులు మహా పూర్ణహుతి,ఏకంత సేవ,గ్రామ బాలికర్తలకు మంగళ షాశాణములను నిర్వహించారు. తదనంతరం స్వామి కళ్యాణంకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాధాలను అందించి అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. స్వామి వారి కల్యాణనికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, టీఎస్ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, దోంకంటి నర్సయ్య, మూత లింబాద్రి, జవ్వాజి భూమయ్య,కె టీ శ్రీనివాస్, కొండల్ శీను, ప్రవీణ్ గౌడ్, ఈశ్వర్,శర్మ నాయక్,కౌన్సిలర్ సతీష్ గౌడ్, ఆవుసుల నర్సయ్య,దేవస్థాన కమిటీ సభ్యులు స్వామి, బోదిరే నర్సయ్య, బోదిరే నైంటి వన్ గంగాధర్, బోదిరే విశాల్,బోదిరే గంగారాం,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

