నిజామాబాద్ సిటీ బతుకమ్మ : బంగ్లాదేశ్ దేశంలో హిందువుల రక్షణకై ప్రతి ఒక్క హిందువు బాధ్యతతో ముందుకు వచ్చి హిందువుల ఐక్యత ఏంటో చాటి చూపాలని జిల్లా విహెచ్పి నాయకుడు దాత్రికా రమేష్ పిలుపునిచ్చారు. ఈనెల 4నబుధవారం జిల్లా కేంద్రంలో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో మన హిందువులు పడుతున్న బాధలు, ఇబ్బందులపై ప్రతి ఒక్క హిందువు, హిందూ సంఘాలు ఏకమై జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ దగ్గర ఎన్టీఆర్ చౌరస్తాలో బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ దేశపు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే హిందూ సంఘాలు అందరూ ఒకటాటిపై వచ్చి నిరసన తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన హిందూ సోదరుల రక్షణ కోసం మనమే గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంఘీభావ సభ ఏ ఒక్క పార్టీ కో చెందిన వ్యక్తులకు సంబంధించింది కాదని హిందువులైన ప్రతి ఒక్కరిదని అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
