ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ గర్ల్స్ పాఠశాలలో బుధవారం ఐసిడిఎస్, ఆర్ సి హెచ్ డి ఆధ్వర్యంలో బాల్ వివాహ్ మూక్త్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తాహసిల్దార్,ఎంపీడీవో, ఎస్సై మరియు మెడికల్ ఆఫీసర్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ….. బాల్యవివాహాలు ఒక సామాజిక దురాచారం, ఎందుకనగా బాల్యవివాహాల వలన బాలల యొక్క విద్య, రక్షణ, ఆరోగ్యం,అభివృద్ధి మరియు వారి కళల భవిష్యత్తు ఆటంకం కలుగును కావున ఇది చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు ఎవరు చేసుకోవద్దని అలాగే ఎవరైనా బాల్య వివాహం చేస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ, ఎస్సై రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఆర్ సి హెచ్ డి సూపర్వైజర్ జి సోనీ, ప్రిన్సిపల్ సుమలత తదితరులు పాల్గొన్నారు.
