బాల్ వివాహ్ ముక్త్ పై అవగాహన
ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ గర్ల్స్ పాఠశాలలో బుధవారం ఐసిడిఎస్, ఆర్ సి హెచ్ డి ఆధ్వర్యంలో బాల్ వివాహ్ మూక్త్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తాహసిల్దార్,ఎంపీడీవో, ఎస్సై మరియు మెడికల్ ఆఫీసర్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ..... బాల్యవివాహాలు ఒక సామాజిక దురాచారం, ఎందుకనగా బాల్యవివాహాల వలన బాలల యొక్క విద్య, రక్షణ, ఆరోగ్యం,అభివృద్ధి మరియు వారి కళల భవిష్యత్తు ఆటంకం కలుగును కావున ఇది చట్టరీత్యా నేరమని,...