ఆర్మూర్, బతుకమ్మ : నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ న అబ్బగొని అశోక్ గౌడ్ మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. రాచరిక పరిపాలనను అంటరానితనాన్ని అంతమొందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. ఈ రాజ్యాంగం ద్వారా వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు ఆయన పెట్టిన బిక్షనే అని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన ఫలాలు కేవలం కొంతమంది పెత్తందారులకు మాత్రమే అందుతున్నాయని అన్నారు. గ్రామీణ స్థాయిలలో ఇంకా వీడీసీ, పెత్తందారుల ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పు రాజేందర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుందాపురం సుభాష్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజాంబాద్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ముత్తన్న, జక్రాన్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి కొప్పు మధు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
