30.9 C
Hyderabad
Monday, August 3, 2026

అక్రమ వెంచర్ నిర్వహణపై కలెక్టర్ కు కార్పొరేటర్ ఫిర్యాదు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగర శివారులోని రెండవ డివిజన్ పరిధిలో మాణిక్ బండారు శివారు ప్రాంతల్లో అక్రమ వెంచర్ల ఏర్పాటుతో ప్రభుత్వ విలువైన స్థలాలు అన్యక్రాంతమవుతున్నాయి. గాండ్ర వెంచర్ నిర్వాహకుడు 250 ఎకరాల వెంచర్ను ఏర్పాటు చేసి వ్యవహరిస్తున్నారని స్థానిక రెండవ డివిజన్ కార్పొరేటర్ రాయసింగ్, ఇతర గ్రామస్తులు కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ నగర కార్పొరేషన్ విస్తరణ నుడా ఏర్పాటుతో విలీన గ్రామాలకు ప్రభుత్వం టి యు ఎఫ్ ఐ డి సి ఫండ్ కింద కేవలం ఆ ఫండును కేవలం గ్రామాలకు చెందిన రోడ్లు ఇతర మౌలిక వసతుల కోసం మాత్రమే ఈ నిధులు వినియోగించుకోవల తప్ప ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ల లాంటివి ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ద్వారా విడుదలైన 10 కోట్ల రూపాయలతో ఏకంగా ఆ వెంచర్లు బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని కార్పొరేటర్ తో పాటు గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. ఈ గండ్ర వెంచర్ నిర్వాహకుడు ప్రేమ్ సాగర్ ఇంతటితో ఆగకుండా చుట్టుపక్కల ఉన్న ఇరిగేషన్, ఎండోమెంట్ భూములను కూడా కబ్జా చేసి మరి వెంచర్ల విస్తరణ చేపడుతున్నారని దీనిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని వెంచర్ ఏర్పాటుచేసిన చర్యలు తీసుకోవాలని కోరారు.

More articles

Latest article