బతుకమ్మ, మోర్తాడ్: ఎలాంటి అనుమతులు లేకుండా ఆదివారం రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను పట్టుకొన్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా నడుపుతున్నందున తగు చర్యకై మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్, నిజామాబాద్ అధికారులకు సమాచారం అందించామని ఎస్సై తెలియజేశారు.
