24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపాధ్యాయుల సత్తా ఏంటో చూపుదాం

Must read

📰 Generate e-Paper Clip

  •  ఐక్యంగా ఉండి ఉపాధ్యాయుల హక్కులను కాపాడుకుందాం
  • పిఆర్టియు శాసనమండలి అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ :  రానున్న పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన ఉపాధ్యాయులు అందరం ఐక్యంగా ఉండి మన హక్కులను రాజకీయపరంగా సాధించుకునేందుకు కలిసి ముందుకు సాగుదామని పిఆర్టియు శాసనమండలి అభ్యర్థి వంగ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పిఆర్టియు తెలంగాణ పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలోఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాజకీయ నాయకుల మాదిరిగా ఉపాధ్యాయులందరూ కూడా తమ హక్కులు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరం ఐక్యమత్యంతో విద్యావంతులైన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన తనను అత్యుత్తమ మెజారిటీతో గెలిపించిఆదరించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.ఏళ్ల తరబడిగా ప్రభుత్వాలు ఉపాధ్యాయుల పట్లనిర్లక్ష్యం వస్తున్నాయనివారికి తగిన విధంగా ప్రమోషన్లు,టీఏడీఏ కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందుతున్నాయని,వీటన్నింటిని సాధించుకోవాలంటే మేధావులమైన తాము ఎమ్మెల్సీ పట్టాపద్రుల ఎన్నికల్లో ఒక్కసారి తనను గెలిపిస్తే దీర్ఘకాలికంగా  అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.ప్రభుత్వాలు నిర్వహించే ప్రతి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే ఉపాధ్యాయుల పట్ల ఇప్పటివరకు ప్రభుత్వాలు చిన్న చూపుచూస్తూనే ఉన్నాయని,మనందరి సమస్యలు పరిష్కారం కావాలంటే పి ఆర్ టి యు పక్షాన నిలబడుతున్న తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా తన శక్తివంచన కృషి చేస్తానని అన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల్లో ఉపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పిఆర్జీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడుమోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కిషన్,లతోపాటు జిల్లా పిఆర్టియు తెలంగాణ కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article