28.8 C
Hyderabad
Monday, August 3, 2026

 పోలీసులకు లొంగిపోయిన రసూల్?

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్ పై దాడి చేసిన షేక్ రసూల్ పొలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. నాగారం 80 క్వార్టర్స్ వద్ధ దండు శేఖర్ పై షెక్ రసూల్ సోమవారం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడికి పకడ్బందీగా ప్లాన్ చేసిన రసూల్ అలియాస్ షక్రూ ముందుగా వీడియో తీసేందుకు ఏర్పాట్లు చేసి శేఖర్ పై దాడి చేసిన విషయం విదితమే. తన ప్లాట్ ను కబ్జా చేయడమే కాకుండా, అటువైపు వెళ్తే చంపుతానని బెదిరించడంతో దాడి చేసినట్లు సెల్ఫీ వీడియోను సోషల్ మిడియాలో రిలీజ్  చేశాడు. సొమవారం రాత్రే రసూల్  ఓ పోలీస్ అధికారివద్ధ లొంగిపోయినట్లు తెలిసింది. అతడిని నిజామాబాద్ డివిజన్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నట్లు సమాచారం.

More articles

Latest article