27.7 C
Hyderabad

రైతులతో ముచ్చటించిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ: మండలంలోని రెంజర్ల గ్రామ రైతులను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి  మంగళవారం ఉదయం కలిశారు. రైతులతో ముచ్చటించి ఏ పంటలు సాగు చేస్తున్నారని ఆరా తీశారు. ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకమని అడిగి తెలుసుకున్నారు. తర్వాత సహకార సంఘం సిబ్బందిని పిలిపించి ధాన్యం కొనుగోలు ఎలా ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట రైతులు ముత్యంరెడ్డి, చిన్నారెడ్డి, బుల్లెట్ రాంరెడ్డి, ముత్తెన్న, ఆకుల రమేశ్, నవీన్, రవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article