27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మద్యం తాగుతూ విధులు నిర్వర్తిస్తున్నపోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రధాన రహదారిపై పోలీసుల బాగోతం

బాన్సువాడ , బతుకమ్మ : సామాన్య ప్రజలకే నిబంధనలు తమకు కాదు అనే రీతిలో పోలీసులు వ్యవహరించిన తీరు పొతంగల్ చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొతంగల్ శివారులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులు సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే మద్యం తాగుతూ కూర్చున్నారు. స్థానికులు దీనిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

More articles

Latest article