30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వైభవంగా శ్రీవారి స్నపన తిరుమంజనం

Must read

📰 Generate e-Paper Clip

భాగవత పారాయణం, తీర్థోత్సవం

భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ అర్చకులు స్వామి వారికి స్నపన తిరుమంజన కార్యక్రమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ భగవత్ క్రియలో భాగంగా అర్చకులు పదవ రోజున శేషహోమంను నిర్వహించారు.

Shrivari Snapana Tirumanjanam in glory

అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకిలో పుష్కరణి వరకు మంగళ వాయిద్యాలతో తీసుకొని వచ్చి స్వామి వారి ఎదుట పంచ కలషములను అర్చకులు ప్రతిష్టింపజేశారు.పసుపు జలం గల కలశంతో, పంచ కలశములలోని జలంతో స్వామి వారిని స్నానమాచారింప జేశారు.

Shrivari Snapana Tirumanjanam in glory

ఈ స్వామి వారి స్నాన ప్రక్రియనే స్నపన తిరుమంజనం అని అంటారని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి వారి కళ్యాణ క్రతువులోని పసుపును దంచి స్వామి వారిపై, స్వామి పరివారం పై సమర్పించారు.పిమ్మట ఆ మంగళ ప్రధమైన హరిద్రాఘత్రం ను భక్తులకు శుభం కలగాలని సంకల్పంతో అర్చకులు భక్తుల శిరస్సులపై చల్లారు. స్వామి వారి విశేషం కార్యక్రమంలో శ్రీభాగవత పారాయణంను అర్చకులు నిర్వహించారు.శ్రీభాగవతంను అర్చకులు పారాయణం చేస్తుండగా శ్రీ హరి యొక్క దివ్యఆయుధమైన శ్రీ సుదర్శన చక్రస్వామికి పుష్కరిణిలో స్నానమాచారింప జేశారు. స్వామి వారికి నిర్వహించిన అరిద్రాభిషేకం జలంను, సుదర్శన చక్ర స్వామిని స్నానమాచారింప జేసిన దివ్య జలమును భక్తులపై అర్చకులు చల్లారు.ఈ స్వామి క్రతువు అనంతరం అర్చకులు విశేషమైన పుష్ప యాగంను నిర్వహించారు. ఈ రోజు చుట్టూ లంబాడా గిరిజనులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవం విశేషం.

Shrivari Snapana Tirumanjanam in glory

More articles

Latest article